Asianet News TeluguAsianet News Telugu

రెండోరోజు కూడా హరీష్ రావు అక్కడే

48 గంటలపాటు అదే పనిలో హరీష్

Harish Rao supervises Kaleswaram works second day

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఆ యాత్ర  రెండో రోజు కూడా కొనసాగింది. గురువారం నాడు ప్యాకేజి 6,7, పనుల పురోగతిని పరిశీలించారు. టన్నెల్ , పంప్ హౌజ్, సర్జ్ పూల్, భూగర్భ విద్యుత్ ఉప కేంద్రం పనులను పరిశీలించారు. అన్నారం బ్యారెజ్ పంప్ హౌస్ పైప్ లైన్ పనులు, లిఫ్ట్ పనులు, సుందిళ్ల బ్యారేజ్ ఫ్లడ్ బ్యాంక్ పనులు, బ్యారేజి గేట్ల పనులను పరిశీలించారు. అనంతరం రాత్రి పదకొండు గంటల వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు, గుత్తేదారులతో సమీక్ష జరిపారు.

రెండో రోజూ మంత్రి హరీష్ రావు క్షేత్ర స్థాయి పర్యటన కొనసాగించారు. ఉదయం అన్నారం బ్యారేజి పంప్ హౌస్ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. అదే సమయానికి పంప్ హౌస్‌లో బిగించే మోటార్లు, విద్యుత్ యంత్రాలు, ఇతర సామగ్రి ఫిన్లాండ్‌ నుంచి  అన్నారం బ్యారేజి   సైట్ కు చేరుకోవడంతో ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వెంటనే ప్రారంభించాలని‌ అక్కడి ఇంజనీర్లను, గుత్తేదారులను ఆదేశించారు. పంప్ హౌస్ పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలన్నారు.  మోటార్ల బిగింపు గురించి ఆండ్రిజ్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.

ఆ తర్వాత అప్రోచ్ ఛానల్ పనులను పరిశీలించారు. తర్వాత అన్నారం పంప్ హౌజ్ హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించి, పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఎంత మంది పని వారు కావాలో ముందే నిర్ణయించుకుని ,ఆ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రెగ్యులేటర్ కు ఆయుష్ లు, గేట్లు ఎప్పటిలోగా బిగిస్తారని ప్రశ్నించారు. పనుల వేగం మరింత పెంచాలన్నారు. ఇంజనీర్లు,‌అధికారులతో పాటు స్థానిక పోలీసు అధికారులను సైతం మంత్రి హరీష్  రావు పనుల పురోగతి ఎలా ఉందని కనుక్కోవడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios