TS Assembly: నిరసనకు సిద్ధమైన హరీశ్ రావు.. శాసన సభ బుధవారానికి వాయిదా

తెలంగాణ శాసన సభ బుధవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. తొలి రోజే అధికార, ప్రతిపక్షాలతో సభ అట్టుడికింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రలు భట్టి విక్రమార్క్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావుల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది.
 

harish rao slams cm revanth reddy speech, speaker gaddam prasad kumar postpones legislative meeting to wednesday kms

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. తొలి రోజే వేడి వేడిగా చర్చలు జరిగాయి. శాసన సభ ఆమోదం తెలిపింది. పరస్పరం దాడికి దిగడం, కౌంటర్లు ఇయ్యడం, ఘాటుగా వ్యాఖ్యలు చేయడం.. ఇవన్నీ ఈ రోజు జరిగాయి. సాయంత్రం సుమారు 5.45 గంటల ప్రాంతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను బుధవారానికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం కేటీఆర్ ప్రసంగంపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. 

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు చురకలు అంటించారు. కుటుంబ పాలన అంటూ విమర్శించారు. కనీసం శాసన సభలోనైనా ఇద్దరు నేతలే మాట్లాడుతారా? వేరే నేతలకూ అవకాశం కల్పించాలని, ప్రజస్వామ్యయుతంగా మెలగాలని చురకలు అంటించారు. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా అని, ఒకరు పెట్టిన పుట్టలోకి ఆయన వచ్చారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి మొదలు పెడితే.. ఎన్ఆర్ఐలుగా ఉన్న వారి కుటుంబ సభ్యులకూ పార్టీ పగ్గాలు అప్పగించారని, కుటుంబ పార్టీ కాంగ్రెస్సే అని బీఆర్ఎస్ నేతలు ప్రతిదాడికి దిగారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌కు మాట్లాడుతున్న తన గొంతు నొక్కేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు నిలదీశారు.

Also Read: Janasena: ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు, వైసీపీ ఫైర్.. తెలంగాణలో ఓటేసి, ఏపీలో మరోసారి వేస్తారా?

మేనేజ్‌మెంట్ కోటా అని ప్రతిసారీ అంటున్న రేవంత్ రెడ్డి.. ఆయనే అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలను మేనేజ్ చేశారని కాంగ్రెస్ నేతలే ఆరోపించారని, ఎన్ఆర్ఐ నేతలకు రేవంత్ టికెట్లు అమ్ముకున్నారనీ ఆరోపణలు ఉన్నాయని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నదని, ఒక సీనియర్ శాసన సభ్యుడిగా తనకు 15 నిమిషాల గడువు ఇవ్వాలని హరీశ్ రావు స్పీకర్‌ను కోరగా.. అందుకు అనుమతించారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు వెళ్లారు. పీవీ నరసింహారావు మరణిస్తే కూడా సోనియా గాంధీ వచ్చి చూసిన పాపాన పోలేదని కామెంట్ చేయగానే.. ఆయన క్లారిఫికేషన్లు ఇవ్వడానికే పరిమితం కావాలని మంత్రులు డిమాండ్ చేశారు. 

Also Read: TS Assembly: అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. వాడిగా కామెంట్లు

హరీశ్ రావు తిరిగి ప్రారంభిస్తుండగా.. కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. హరీశ్ రావు ఆయన వివరణలకే పరిమితం కావాలని, చర్చను లేవదీసే అంశాలను ప్రస్తావించరాదని సభాపతి పలుమార్లు విన్నవించారు. దీంతో తన గొంతు నొక్కొద్దని, సభలో వాస్తవాలు రికార్డ్ అయ్యేలా చూసే బాధ్యత ఒక సీనియర్ శాసన సభ్యుడిగా తనపై ఉంటుందని హరీశ్ రావు వాదించారు. లేదంటే.. నిరసన తెలుపడానికి తనకు అనుమతి ఇవ్వాలని, నిరసన తెలిపే హక్కు తనకు ఉంటుందని హరీశ్ రావు అన్నారు. ఇంతలో మంత్రి శ్రీధర్ బాబు లేచి.. ప్రతిపక్షాలకు ఇంకేమైనా అభ్యంతరాలు, విభేదాలు ఉన్నా.. ముందు ముందు చర్చించుకోవచ్చని వివరించారు.

అనంతరం, సభాపతి శాసన సభను వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం లభించిందని, సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios