Harish Rao:"కాంగ్రెస్ ది బలుపు కాదు వాపే.."
Harish Rao: తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ గెలుస్తుందని, మరోసారి కేసీఆర్ ను సీఎం చేయబోతున్నారని , ఎన్నికల ప్రచార సరళి పరిశీలిస్తేనే ఆ విషయాన్ని రుజువు చేసిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకం కే చంద్రశేఖర్‌రావు వెంటే ఉన్నారని చెప్పారు.
Harish Rao: తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ గెలుస్తుందని, ఎన్నికల ప్రచార సరళే ఆ విషయాన్ని రుజువు చేసిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు దీమా వ్యక్తం చేశారు. తన ప్రచారానికి సంబంధించిన చివరి దశను పూర్తి చేస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎంత మంది రాజకీయ పర్యాటనలు చేసినా, ఢిల్లీ నుంచి ఎంతమంది వచ్చినా.. తెలంగాణ ప్రజలు మాత్రం సీఎం కే చంద్రశేఖర్‌రావు వెంటే ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ ది బలుపు కాదు వాపే నని విఫలమైన వారి సభలు రుజువు చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీల నుంచి ఎంత మంది పొలిటికల్ టూరిస్టులు వచ్చినా కేసీఆర్ కే ప్రజలు బ్రహ్మ రథం పట్టారని దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30 న జరిగే పోలింగ్ లో కేసీఆర్ పై తెలంగాణ ఏక పక్షంగా తన అభిమానాన్ని చాటుకోబోతోందనీ, మూడో సారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్దమయ్యారని అన్నారు. ప్రచారంలో కష్ట పడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించి బీఆర్ఎస్ కు భారీ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను సాధించి, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా ఆశీర్వదించాలని మరొక్క సారి కోరారు.
అంతకు ముందు మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రాణం పనంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ లేకుంటే.. ప్రత్యేక తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో కనబడని వారు.. నేడు ఓట్ల కోసం బయలు దేరారని, అలాంటి దొంగలకు తెలంగాణ ప్రజానీకం ఓటుతో బుద్ది చెప్పాలని అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో... తెలంగాణ కూడా కేసీఆర్ చేతులో ఉండటమే సురక్షితంగా ఉంటుందని అన్నారు.
సిద్దిపేటకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయనీ, కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు ప్రకటించినా అందులో సిద్దిపేట పేరు తప్పకుండా ఉంటుందని అన్నారు. సిద్దిపేట ప్రజల ప్రేమ వెలకట్ట లేనిది.. ప్రతి సారి మెజార్టీ పెంచుతూ.. ప్రేమ అందిస్తున్న సిద్దిపేట ప్రజలకు తన జన్మను అంకితం చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించుకోవడంతో పాటుగా..సిద్దిపేట ట్యాగ్ లైన్ అయినా జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు తెచ్చుకున్నట్లు మరో సారి పునర్ఘాటించారు. సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేదని ప్రతి పక్షాలకు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.