Harish Rao: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే అంశంపై మంత్రి హరీశ్ రావు సంచలన స్పందించారు. ఇనాళ్లు బీఆర్‌ఎస్ పార్టీకి పట్టిన పీడ విరగడ అయ్యిందని, పార్టీలో ఉంటూ తమకు వెన్నుపోటు పొడిచారంటూ తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. 

Harish Rao: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి పట్టిన పీడ విరగడ అయ్యిందని, ఇన్నాళ్లు పార్టీలో ఉంటూ తమకే వెన్నుపోటు పొడిచారంటూ పొంగులేటి ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో 6589మంది పోడు రైతులకు 13,139.05 ఎకరాలకు సంబంధించిన పట్టాలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వద్దనుకున్న వాళ్ళు.. నేడు కాంగ్రెస్ పార్టీకి ముద్దయ్యారని, వారు కాంగ్రెస్ పార్టీలో చేరితే.. జరిగే నష్టం లేదని స్పష్టం చేశారు. ఒక్కప్పుడు పొంగులేటిని తిట్టినోళ్లే.. నేడు అతనని ముద్దు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పక్కన పెట్టిన వాళ్లను కాంగ్రెస్ తీసుకుంటున్నదని, ఇకపై పార్టీలో శకుని పాత్రలు పోషించేవారు ఉండరన్నరని అన్నారు. ఇనాళ్లు వాళ్లు పార్టీ విజయానికి అడ్డుగా ఉండి.. వెన్నుపోటు పొడిచారనీ, సీట్లు గెలవకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన(పొంగులేటి) కాంగ్రెస్ లోకి వెళ్ళడం వల్ల బీఆర్ఎస్ కు జరిగే నష్టమేమి లేదన్నారు. 

పార్టీ వద్దనుకున్న వాళ్ళకు దిక్కులేదనీ.. కాంగ్రెస్ కు సక్కి లేదని ఎద్దేవా చేశారు. గతంలో అదే వ్యక్తిని (పొంగులేటి) ఆర్థిక అరాచకవాది,గుత్తేదారుడు అని విమర్శించిన మల్లు భట్టి విక్రమార్క.. నేడు ఆయనను ఎందుకు పార్టీలోకి తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీన్ రివర్స్ అవుతుందనీ, ఆనాడు ఒక్కటి గెలిచి తొమ్మిది సీట్లు పోయ్యాయని.. రేపు తొమ్మిది గెలిచి.. ఒక్కటి మాత్రమే పోతదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి శకుని పాత్రలన్ని పోయినందునా సాదా సిదా కొట్లాడుతామని, పొంగులేటీ కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రనా పార్టీకి జరిగే నష్టమేమి లేదనీ హరీశ్‌రావు స్పష్టం చేశారు.