రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో త్వరలో 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని అన్నారు.
రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో త్వరలో 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని అన్నారు. హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ‘ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్’లో హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆస్పత్రులలో బెడ్స్, స్టాఫ్‌ను పెంచడంతో పాటు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి ఎన్నో పథకాలు గర్భిణీల కోసం తీసుకొచ్చామని చెప్పారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని హరీష్ రావు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ఎంసీహెచ్ ఆస్పత్రుల సంఖ్యను పెంచామని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో గర్భిణీల్లో సమస్యలను గుర్తిస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గిందని.. అయితే ఈ మరణాలకు గల కారణాలపై సంబంధించి లోతైన విశ్లేషణ చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో త్వరలోనే 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రిస్క్ ఉన్న గర్భిణీలను డెలివరీ డేట్ కి ముందు గానే హాస్పిటల్‌లో జాయిన్ చెయ్యమని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు మంత్రి సూచించారు. హాస్పిటల్‌లో ఇన్ఫెక్షన్ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. బాలింతలకు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయో కూడా పరిశీలించాలని సూచించారు. అంతా బాగుందని నిర్దారించుకున్నాకే ఇంటికి పంపాలని చెప్పారు.
