బాధ్యతలు అప్పగించడమే తడువు... వైద్యారోగ్య మంత్రిగా హరీష్ కీలక నిర్ణయాలు

తెలంగాణ వైద్యారోగ్య శాఖ బాధ్యతలు దక్కడమే తడువు మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. వైద్యారోగ్య శాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

harish rao review meeting on medical and health ministry

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రిగా కొనసాగుతున్న హరీష్ రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలను కూడా సీఎం కేసీఆర్ అప్పగించిన విషయం తెలిసిందే. గతంలో ఈటల రాజేందర్ ఈ శాఖ బాధ్యతలు చూసుకోగా ఆయన బర్తరఫ్ తర్వాత ఇప్పటివరకు కేసీఆర్ వద్దే ఈ వైద్యారోగ్య శాఖ వుంది. అయితే తాజాగా ఆ శాఖ బాధ్యతలను సీఎం నుండి స్వీకరించిన హరీష్ వెంటనే రంగంలోకి దిగి పని ప్రారంభించారు. 

గురువారం hyderabad లోని ఎంసీహెచ్చార్డీలో రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో health minister harish rao సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, టీకాలు, కొత్త మెడిక‌ల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం, వ‌రంగ‌ల్‌లోని మ‌ల్టీ సూప‌ర్ స్పెషాల్టీ ఆసుప‌త్రి నిర్మాణం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సందర్భంగా corona vaccination ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. శ‌నివారం జిల్లా క‌లెక్ట‌ర్లు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని హరీష్ నిర్ణ‌యించారు.

వీడియో

ఇప్పటికే రాష్ట్రంలో జాతీయ స‌గ‌టును మించి వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని harish rao పేర్కొన్నారు. బుధ‌వారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొద‌టి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ కూడా వేశారని చెప్పారు. అదే స‌మ‌యంలో జాతీయ స్థాయిలో మొద‌టిడోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా న‌మోదైంద‌ని వెల్ల‌డించారు.

read more  హరీశ్‌రావుకు అదనపు బాధ్యతలు.. వైద్యారోగ్య శాఖ కూడా ఆయనకే, హుజురాబాద్‌ ఎఫెక్ట్ లేనట్లేనా..?

రాష్ట్రంలో కొత్త మెడిక‌ల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రులు, వ‌రంగ‌ల్‌లోని మ‌ల్టీ సూప‌ర్ స్పెషాల్టీ ఆసుప‌త్రి నిర్మాణ ప‌నులు వేగంగా పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగాన్ని మ‌రింత పెంచాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. అధికారుల‌తో చ‌ర్చించిన అనంత‌రం ప‌లు ముఖ్యమైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. 

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో 350 ప‌డ‌క‌లు గ‌ల కింగ్ కోఠి జిల్లా ద‌వాఖాన‌లో సాధార‌ణ వైద్య‌సేవ‌లు పున‌రుద్ధ‌రించాలని నిర్ణయించారు. టిమ్స్ హాస్పిట‌ల్‌లో 200 ప‌డ‌క‌లు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మిన‌హా సాధార‌ణ వైద్య సేవ‌లు ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాల చెల్లింపు, ఆసుపత్రి బకాయిలు చెల్లింపును వెంటనే చేయాలని మంత్రి ఆదేశించారు.

read more  వరిపై కేసీఆర్ పోరు: రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్‌కు షరతులతో అనుమతి

అంత‌కుముందు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మాన్సుక్ మాండ‌వీయ‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి హ‌రీష్ రావు, వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో క‌రోనా కేసులు, వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం గురించి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధ‌ర్‌, డీఎంఈ ర‌మేశ్‌రెడ్డి, కాలోజీ వ‌ర్సిటీ వీసీ క‌రుణాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. 

రెండురోజుల క్రితమే హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ వైద్యశాఖ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హరీశ్ రావు ఆర్ధిక శాఖ  బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను  కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో ఈ శాఖ సీఎం కేసీఆర్ వద్దే వుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios