Asianet News TeluguAsianet News Telugu

హరీశ్‌రావుకు అదనపు బాధ్యతలు.. వైద్యారోగ్య శాఖ కూడా ఆయనకే, హుజురాబాద్‌ ఎఫెక్ట్ లేనట్లేనా..?

టీఆర్ఎస్ (trs) అగ్రనేత , మంత్రి హరీశ్ రావుకు (harish rao) సీఎం కేసీఆర్ (kcr) అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను (health department) అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హరీశ్ రావు ఆర్ధిక శాఖ (telangana finance minister) బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. 

Additional portfolio to minister Harishrao
Author
Hyderabad, First Published Nov 9, 2021, 8:38 PM IST | Last Updated Nov 9, 2021, 9:06 PM IST

టీఆర్ఎస్ (trs) అగ్రనేత , మంత్రి హరీశ్ రావుకు (harish rao) సీఎం కేసీఆర్ (kcr) అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను (health department) అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హరీశ్ రావు ఆర్ధిక శాఖ (telangana finance minister) బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను (etela rajender) కేబినెట్ (telangana cabinet) నుంచి బర్తరఫ్ చేయడంతో ఈ శాఖ సీఎం కేసీఆర్ వద్దే వుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. 

అంతకుమందు కేసీఆర్ కరోనా (coronavirus) బారినపడటం తర్వాత  బిజీగా వుండటంతో హరీశ్ రావే వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు సమీక్షల్లో పాల్గొన్నారు. అయితే తరువాత ఆయనకు ఈ శాఖ అప్పగించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం కూడా నడిచింది. మరోవైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్.. అనంతరం శాఖలకు సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ ఎంతో కీలకం . ఏ శాఖను అప్పగించినా.. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరున్న హరీశ్ రావు.. వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు తీసుకుంటే.. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలతో పాటు ఆరోగ్య రంగం మరింత మెరుగుపడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ALso Read:Huzurabad bypoll result 2021: ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ట్రబుల్

కాగా.. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ ఓడిపోవడంతో ఈ ఫలితం హరీశ్ రావును చిక్కుల్లో పడేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించే బాధ్యతను కేసీఆర్ ఆయన భుజాల మీద మోపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్న నేతగా హరీశ్ గుర్తింపు పొందారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా.

ఇదే సమయంలో తన పాత మిత్రుడు, తాజా ప్రత్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కానీ, ఫలితం ఆయనకు ప్రతికూలంగా వచ్చింది. నిజానికి, హుజూరాబాద్ నియోజకవర్గంలో Eatela rajender ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కన్నా హరీష్ రావే అనిపించేలా ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. 

టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా హాజరు కాకుండా హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం పనిచేశారు. ఆయనతో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కూడా ఉప ఎన్నిక ప్రచారంలో నిండా మునిగిపోయి ఈటల రాజేందర్ ను ఓడించాలని ప్రయత్నించారు. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో మకాం వేశారు. అయినా ఫలితం సాధించలేకపోయారు. 

గతంలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కేసీఆర్ హరీష్ రావుకే అప్పగించారు. అక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పరాజయం పాలయ్యారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించి శాసనసభలోకి అడుగు పెట్టారు. హరీష్ రావుకు HUzurabad bypoll result రెండో చేదు అనుభవం. ఈ ఓటమితో కేసీఆర్ వద్ద హరీష్ రావు ప్రాబల్యం తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే తాజాగా ఆయనకు సీఎం.. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించడంతో హరీశ్ రావుపై హుజురాబాద్ ఎఫెక్ట్ పడలేదనే తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios