Harish Rao : 'అగ్గిపెట్టె ముచ్చట ఇక బంద్ చేయండి"
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్ చేయాలని సూచించారు. తమను కించపరిచేలా రాజకీయంగా విమర్శిస్తామనుకుంటే అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టె దొరకదంటూ సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్ చేయాలని సూచించారు. పదే పదే తమను కించపరిచి, రాజకీయంగా విమర్శిస్తామనుకుంటే అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ… ఆనాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించలేదనీ, అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదని మండిపడ్డారు. అమరుల పాడెమోసినవాళ్లు కూడా కాదని తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. తుపాకులతో ఉద్యమకారులను బెదిరించిన రేవంత్ కు తెలంగాణ పోరాటం, అమరవీరులకు గురించి తెలుస్తదని తాను అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ప్రతిసారి అగ్గిపెట్టె విషయం తీస్తారని అసహనం వ్యక్తం చేశారు. మను కించపరిచి, రాజకీయంగా విమర్శిస్తామనుకుంటే అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
ఎస్ఎల్‌బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పదేళ్లలో కిలోమీటర్ తవ్వారని రేవంత్ చెప్పారని, కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వినట్లు తెలిపారు. ఇలాంటి విషయాలను సీఎం రేవంత్ సరి చేసుకోవాలని సూచించారు. మాట్లాడే విషయంపై కొంత అవగాహన ఉండాలని హితవు పలికారు. నాగార్జున సాగర్ విషయంలోను సీఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
అలాగే.. నాగార్జున సాగర్ విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో.. నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణలో కంట్రోల్‌లోకి ఇచ్చారని పేర్కొన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్‌ను ఏపీ కంట్రోల్‌లోకి తీసుకుందన్నారు. రెండు నెలలు గడుస్తున్నా సీఆర్పీఎఫ్ భద్రతలో సాగర్ ఉందని వివరించారు. సాగర్‌ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకునేందుకు కృషి చేయాలని కోరారు. దీనికోసం సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు