తెలంగాణ ఇరిగేషన్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీష్ రావు గురించి చాలా మందికి తెలుసు. ఆయన సిద్ధిపేటలో ఓటమి ఎరుగని నాయకుడు. తెలంగాణలో రికార్డు మెజార్టీతో గెలిచిన నాయకుడు కూడా ఆయనే. ఉద్యమ కాలంలో సీమాంధ్ర పాలకులకు, పోలీసు పెద్దలకు సింహస్వప్నంగా నిలిచారు.

హరీష్ రావు సిద్ధిపేటలో అంత భారీ మెజార్టీతో ఎలా గెలుస్తున్నారబ్బా అని తెలుగు రాజకీయ నేతలంతా ఆసక్తి చూపిస్తారు. హరీష్ మంత్రాంగం ఎలా ఉంటుంది.? ఆయన వర్క్ స్టయిల్ ఎలా ఉంటుందని అందరూ చర్చించుకుంటారు.

మరి హరీష్ రావు సిద్ధిపేటలో ఎలా గెలుస్తాడో వివరించే వీడియో ఒకటి ఏషియానెట్ కు అందింది. అందులో హరీష్ రావు సంచనల విషయాలు చెప్పారు. తాను చందాలు తీసుకున్న విషయాన్ని కూడా వివరించారు. ఆ వీడియో కింద ఉంది మీరూ చూడండి.