Asianet News TeluguAsianet News Telugu

Konijeti Rosaiah Death: అసెంబ్లీలో నేను తొలిసారిగా మాట్లాడినప్పుడు రోశయ్య పిలిచి అభినందించారు: హరీశ్ రావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణంపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ తెలుగు ప్రజలు ఒక అపార రాజకీయ ప్రజ్ఞాశాలిని కోల్పోయారని అన్నారు. తాను అసెంబ్లీలో తొలిసారిగా మాట్లాడినిప్పుడు పిలిచి మరీ అభినందించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని అన్నారు. 
 

harish rao comments on konijeti roshaiah death
Author
Hyderabad, First Published Dec 4, 2021, 1:09 PM IST

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ సీఎం కొణిజేటి రోశయ్య(Konijeti Roshaiah) మరణంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) స్పందించారు. రోశయ్య మరణం దురదృష్టకరం అని అన్నారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని వివరించారు. తనను ఎప్పుడూ ప్రోత్సహించేవారని తెలిపారు. అసెంబ్లీలో తాను తొలిసారిగా మంత్రిగా మాట్లాడినప్పుడు రోశయ్య పిలిచి అభినందించారని గుర్తు చేసుకున్నారు. ‘నాకు మంచి భవిష్యత్ ఉన్నదని అన్నారు. మంత్రిగా చక్కటి సమాధానం చెప్పానని ప్రోత్సహించారు’ అని మననం చేసుకున్నారు. కొణిజేటి రోశయ్య భౌతక దేహానికి పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు.

రోశయ్య మరణం దురదృష్టకరమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయన 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఆ ఘనత ఆయన కేవలం ఒక్కరిదేనని మంత్రి హరీశ్ రావు వివరించారు. ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంటేరియన్‌గా, వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారని అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా సేవలు అందించారని తెలిపారు. అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వహించి ఆయన సేవలందించిన పదవులకే వన్నె తెచ్చారని తెలిపారు. ఆయన అపార రాజకీయ ప్రజ్ఞాశాలి అని వివరించారు. తన పార్టీ, ఇతర పార్టీల వారు అనే తారతమ్యం చూపకుండా అందరితోనూ కలిసిపోయేవాడని చెప్పారు. అందుకే స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా మిత్రులను సంపాదించుకున్న అరుదైన రాజకీయ వేత్త అని వివరించారు.

Also Read: Konijeti Rosaiah Death: రేపు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు భౌతికకాయం..

కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై ఆయనతో చాలా సార్లు చర్చించామని తెలిపారు. ఏది ఏమైనా తెలుగు ప్రజలు ఒక అపార రాజకీయ అనుభవ శాలిని కోల్పోయారని అన్నారు. కొణిజేటి రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కొణిజేటి రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు.

Also Read: Konijeti Rosaiah Death: తెలంగాణలో మూడు రోజులు సంతాప దినాలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

రోశయ్య అంత్యక్రియలు (Konijeti rosaiah funeral) ఆదివారం (డిసెంబర్ 5) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లో మహాప్రస్తానంలో జరగనున్నట్టుగా కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం స్టార్ ఆస్పత్రిలో ఉందని.. వైద్య ప్రక్రియ అనంతరం అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించనున్నట్టుగా చెప్పారు. రేపు ఉదయం ఆయన ఇంట్లో తుది పూజలు చేసిన తర్వాత ఉదయం 11.30 గంటలకు ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు తరలించనున్నట్టుగా చెప్పారు. 

మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నట్టుగా చెప్పారు. అనంతరం గాంధీ భవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి  గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్తానంలో రోశయ్య అంత్యక్రియలు (Konijeti rosaiah Last rites) నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios