Asianet News TeluguAsianet News Telugu

బాలుడిపై అత్యాచారం: నిందితుడిని పట్టించిన హెయిర్ స్టైల్

బాలుడిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించి హత్య చేసిన కిరాతకుడిని పోలీసులు పట్టుకున్నారు. 

hair style helps to police for arresting of accused
Author
Hyderabad, First Published May 14, 2019, 9:39 AM IST

బాలుడిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించి హత్య చేసిన కిరాతకుడిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జల్‌పల్లి వాది-ఎ-ముస్తఫా కాలనీకి చెందని ఏడేళ్ల బాలుడు ఈ నెల 8న రాత్రి తొమ్మిది  గంటల సమయంలో కిరాణా కొట్టుకు వెళుతున్నారు.

ఆ సమయానికి అదే మార్గంలో వెళ్తున్న ఒమర్ బిన్ హసన్ ఆ బాలుడిని గమనించాడు. బాలుడిని ఎక్కడికి వెళుతున్నావని అడిగి వేరే దుకాణంలోకి తీసుకెళ్లాడు. బాలుడు ఏడవటంతో మొదలుపెట్టినప్పటికీ.. అయినప్పటికీ అతను చిన్నారిపై అత్యాచారానికి దిగాడు.

దీనికి భయపడిపోయిన బాలుడు గట్టిగా అరిచాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ మహిళ.. బాలుడి ఏడుపు విని ఆ వైపు వచ్చింది. చిన్నారి అరుపులు వినిపిస్తున్న వైపుగా రావడం... ఒమర్‌ గమనించాడు. ఈ క్రమంలో దొరికిపోతాననే భయంతో చిన్నారి తలను బండరాయికి బలంగా మోదాడు.

దీంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తమ చిన్నారి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలుడు కనిపించకుండా పోయిన ప్రాంతం హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దుల్లో ఉండటంతో బాలాపూర్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.

ఇంటికి చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించగా... ఓ యువకుడు చేతిలో చెప్పులు పట్టుకుని పారిపోతూ కనిపించాడు. అయితే వీడియోలోని దృశ్యాలు స్పష్టంగా లేకపోవడంతో దర్యాప్తునకు కొంత ఆటంకం ఏర్పడింది.

ఈ క్రమంలో నిందితుడి హెయిర్ స్టైల్ విచిత్రమైన ఆకారంలో ఉండటం, చేతిలో ఉన్న చెప్పుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఫోటో ఆధారంగా స్ధానికులను  ఆరా తీయగా.. హసన్ అనే వ్యక్తి అదే పోలికలతో ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా ఆరా తీశారు.

ఘటన జరిగిన తర్వాత హసన్ ఇంటికి రాకపోవడంతో పాటు ఎర్ర చెప్పులు అతనివేనని తేలడంతో దురగతానికి పాల్పడిన వ్యక్తి హసన్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం అతని ఇంటిపై నిఘా పెట్టి  సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios