ప్రేమపెళ్లి చేసుకున్న భార్య విడిచి వెళ్లిందని.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య...

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వదిలేసి వెళ్లడంతో మానసిక వేదనకు గురైన ఓ జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్ లో కలకలం రేపింది. 

Gym Trainer Committed Suicide in Hyderabad - bsb

హైదరాబాద్ : హైదరాబాదులోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ జిమ్ ట్రైనర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి డిఐ ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పటేల్ నగర్ కు చెందిన వెంకటేష్ గౌడ్ కొడుకు రాకేష్ గౌడ్ (27) విద్యానగర్లో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. అయితే కొద్దికాలం తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రాకేష్ గౌడ్ భార్య అతడిని వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

అప్పటినుంచి రాకేష్ గౌడ్ తీవ్ర మానసిక వేదనతో బాధపడుతున్నాడు. ఈ బాధతోనే ఈనెల 12న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎవరికీ చెప్పలేదు. దీంతో తల్లిదండ్రులు అంతటా వెతికినా... ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని మిస్సింగ్ కేసుగా మొదట  దర్యాప్తు ప్రారంభించారు.  అయితే, ఎవరికీ చెప్పకుండా వెళ్ళిన రాకేష్ గౌడ్ శుక్రవారం ఇంటికి తిరిగివచ్చాడు.

ఇంట్లో ఎవరూ లేకపోవడం..  ఇంటికి తాళం వేసి ఉండడంతో..  తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. 

తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ కు బెదిరింపు కాల్.. ఒకరి అరెస్ట్

ఇదిలా ఉండగా, దక్షిణ కర్ణాటకలోనూ.. కేరళలోని ఉత్తర కాసర రోడ్డు జిల్లాలోనూ దాదాపు 1000 సొరంగాలు తవ్విన ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు. ఈ సొరంగాల ద్వారా నీటి ఎద్దడిని తొలగించడంలో ఆయన కీలకపాత్ర పోషించాడు. అతనే సి. కున్హాంబు. 72 ఏళ్ల వయసులో అతను ఊరికి వేలాడుతూ కనిపించాడు.  అతని ఆకస్మిక మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.  రెండు రోజులకిందట అతను తన నివాసంలో చనిపోయి కనిపించాడు. విషయం తెలిసి ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం దానిని ఆత్మహత్యగా అంచానకు వచ్చారు.  శుక్రవారం దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు. 

ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.  దక్షిణ కర్ణాటకలో.. కేరళలోని ఉత్తర కాసర రోడ్డు జిల్లా వరకు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అతని పేరు బాగా తెలుసు. భూగర్భ జలాలను  పెంచడం కోసం నేలకు ఉన్న గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకునేలా ఆయన పనిచేసేవాడు. ఈ మేరకు సొరంగబావులు తవ్వేవాడు. అలా చేయడంలో కున్హాంబుది  అందవేసిన చేయి. మంచి పేరు కూడా ఉంది. ‘కున్హాంబుకు  14ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి సొరంగాలు తవ్వుతున్నాడు. ఎంతోమంది  భౌగోళిక శాస్త్రవేత్తల కంటే కున్హాంబుకు ఉన్న భౌగోళిక అవగాహన ఎంతో గొప్పగా ఉంటుంది’ అని జాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి గోవిందన్ కుట్టి ఓ సందర్భంగా తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios