హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం అనధికారిక సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీఎం హోదాలో వున్న కేసీఆర్ చేయాల్సిన పనులన్నీ ఆయన తనయుడు కేటీఆరే చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై శాసనమంబలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటే ఎలాంటి సంకోచం లేకుండా చేస్తారని తెలిపారు. అయితే కేవలం కేసీఆర్ తనయుడిగానే కాకుండా ఎలాంటి బాధ్యతలయినా సమర్థవంతంగా నిర్వహించే సత్తా కేటీఆర్ కు వుందని... అన్ని పదవులకూ ఆయన సమర్ధుడేనని అన్నారు. ఇలా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే తామంతా సమర్థిస్తామని మండలి ఛైర్మన్ పరోక్షంగా వెల్లడించారు. 

  ప్రణబ్ తో కేసీఆర్ అనుబంధం (ఫొటోలు)

ఇక అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 20 రోజుల పాటే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సభలో సభ్యులు భౌతిక దూరాన్ని పాటించేలా, సభ్యులు థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే సభ్యుల సౌకర్యార్థం మండలిలో కొత్తగా 8 సీట్లను ఏర్పాటు చేశామన్నారు. 

 ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులు సభ ముందుకు నాలుగు బిల్లులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నూతన రెవెన్యూ చట్టాన్ని ఈ సమావేశాల్లోనే తేవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు గుత్తా తెలిపారు.