మునుగోడులో నా కొడుకు పోటీ చేయడం లేదు: తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో తన కొడుకు పోటీ చేయడం లేదని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు తాను గొప్పగా ఊహించుకొంటున్నాడని ఆయన మండిపడ్డారు.
నల్గొండ: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో జరిగితే తన కొడుకు TRS నుండి పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని Telangana Legislative Council chairman గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
గురువారం నాడు Gutha Sukender Reddy మీడియాతో మాట్లాడారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన ఏం చేస్తారని ప్రశ్నించారు. komatireddy Rajagopal Reddy తనకు తాను ఎక్కువగా ఊహించుకొంటున్నాడన్నారు.
.ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో తామే మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరుతారని కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న మీడియా చానెల్స్ ఇంటర్వ్యూలలో ప్రకటించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ విషయమై ఆ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలను అప్పగించింది ఎఐసీసీ. దిగ్విజయ్ సింగ్ ఈ మేరకు రాజగోపాల్ రెడ్డి కి ఫోన్ చేశారు. ఢిల్లీకి రావాలని రాజగోపాల్ రెడ్డి డిగ్గీ సూచించారు. పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా రాష్ట్రంలో పార్టీ బలహీనపడేలా చేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు తెలంగానలో ప్రస్తుతం ఉంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25న తనతో భేటీ అయిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో రాజగోపాల్ రెడ్డి ఈ విషయాలను చెప్పారు.
అయితే పార్టీలో ఉండాలని భట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డికి సూచించారు.పార్టీ సముచిత గౌరవం ఇస్తుందని కూడా భట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. బుధవారం నాడు రాత్రి ఢిల్లీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మాణికం ఠాగూర్ లు సమావేశమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయమై చర్చించారు. పార్టీలో రాజగోపాల్ రెడ్డి కొనసాగేందుకు అన్ని రకాల అంశాలను చర్యలను పరిశీలించాలని అధినాయకత్వం సూచించింది. దీంతో దిగ్విజయ్ను రంగంలోకి దించారు. దిగ్విజయ్ తోపాటు రేవంత్ రెడ్డి, పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా ఈ విషయమై రాజగోపాల్ రెడ్డితో చర్చించనున్నారు.
also read:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్దికి బుజ్జగింపులు: దిగ్విజయ్ ఫోన్, ఢిల్లీ రావాలని సూచన
మరో వైపు బీజేపీ నేతలు కూడా రాజగోపాల్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేరేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. లేదా చౌటుప్పల్ లో నిర్వహించే అమిత్ షా సభలో రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్పించే విషయమై కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు.ఈ నెల 29న బీజేపీ నేతలతో కలిసి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం.