కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్దికి బుజ్జగింపులు: దిగ్విజయ్ ఫోన్, ఢిల్లీ రావాలని సూచన
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దిగ్విజయ్ సింగ్ కు ఈ బాధ్యతలను అప్పగించింది. దిగ్విజయ్ సింగ్ ఢిల్లీకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోరారు.
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy బీజేపీలో చేరకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయక్వం చర్యలు చేపట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని Congress పార్టీలోనే కొనసాగేలా ఒప్పించే బాధ్యతను దిగ్విజయ్ కు అప్పగించింది ఎఐసీసీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో దిగ్విజయ్ సింగ్ చర్చించనున్నారు. త్వరలోనే BJP లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరే అవకాశం ఉంది. ఇటీవలనే కేంద్ర హోంమంత్రి Amit Shah తో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 24న మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మార్పు చారిత్రక అవసరమని కూడా రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి వెళ్లకుండా ఆ పార్టీ నాయకత్వం చర్చలు చేస్తుంది.ఈ నెల 25న సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సుమారు నాలుగు గంటల పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించారు. భట్టి విక్రమార్క భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త Sunil కూడా రాజగోపాల్ రెడ్డితో బేటీ అయ్యారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలో చేరుతారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjayనిన్న ప్రకటించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్స్ ఏమిటో తెలుసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ విషయమై Digvijay Singh, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించనున్నారు. ఢిల్లీకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు.
బుధవారం నాడు రాత్రి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్ తో తెలంగాణకు చెందిన నేతలు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణికం ఠాగూర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకండా ఏం చేయాలనే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ పనిచేశారు.దిగ్విజయ్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు డిగ్గీని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. దిగ్విజయ్ సింగ్ తో పాటు రేవంత్ రెడ్డి, పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేరకుండా నిలువరించే బాధ్యతను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.
also read:12 మంది ఎమ్మెల్యేలు జంప్.. నేను సీఎల్పీగా వుంటే, ప్రజల ఫీడ్‌బ్యాక్‌తోనే నా రాజీనామా : తేల్చేసిన రాజగోపాల్ రెడ్
బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ విషయమై తన అనుచరులతో చర్చిస్తున్నారు. పార్టీ మార్పుతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై అభిప్రాయాలను సేకకరిస్తున్నారు. మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయమై చర్చించినట్టుగా సమాచారం.
మరో వైపు పార్టీలో తనకు అవమానం జరిగిందని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు చెప్పినట్టుగా సమాచారం. పార్టీలో ఏ రకమైన పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుకొంటున్నారనే విషయమై కూడ దిగ్విజయ్ సింగ్ చర్చించనున్నారు.