Asianet News TeluguAsianet News Telugu

అనుమానాస్పద స్థితిలో గురుకుల అధ్యాపకురాలు మృతి..

గురువారం బాలుర కళాశాలలో సాయంత్రం విధులు ముగిసిన అనంతరం Rest తీసుకునేందుకు కళాశాల ప్రాంగణంలో తనకు కేటాయించిన గదికి వెళ్లారు. రాత్రి అయినా గది నుంచి ఎంతకీ రాకపోవడంతో సహ అధ్యాపకులు వెళ్లి చూశారు. తన గదిలో ఫ్యాన్ కు చీరతో Hanging వేసుకుని కనిపించడంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. 

Gurukul teacher dies under suspicious circumstances in illandu
Author
Hyderabad, First Published Dec 17, 2021, 7:26 AM IST

ఇల్లందు : స్థానిక గురుకుల కళాశాల Faculty అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు మండలంలోని రొంపేడు గ్రామానికి చెందిన సువర్ణపాక కల్యాణి(26) రెండేళ్లుగా అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో టీజీటీ సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

గురువారం బాలుర కళాశాలలో సాయంత్రం విధులు ముగిసిన అనంతరం Rest తీసుకునేందుకు కళాశాల ప్రాంగణంలో తనకు కేటాయించిన గదికి వెళ్లారు. రాత్రి అయినా గది నుంచి ఎంతకీ రాకపోవడంతో సహ అధ్యాపకులు వెళ్లి చూశారు. తన గదిలో ఫ్యాన్ కు చీరతో Hanging వేసుకుని కనిపించడంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. 

ఎస్సై తిరుపతిరావు ఘటనాస్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అధ్యాపకురాలి మృతి మీద పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Suspicions వ్యక్తం అవుతున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్న టీచర్ అంతలోనే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటో అని చర్చించుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా, నవంబర్ లో విశాఖ జిల్లాలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. 37 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న రాత్రి తల్లిదండ్రుల దగ్గర పడుకున్నinfant తెల్లవారేసరికి కనబడకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. చివరకు ఇంట్లోనే ఓ Plastic drumలో పసికందు శవమై కనిపించాడు. 

అయితే డ్రమ్ము కూడా మూత వేసి ఉండడంతో ఇది హత్యగా అనుమానిస్తున్నారు. పసికందు తల్లిదండ్రులు అప్పలరాజు, సంధ్య కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే తమ చిన్నారి మీద ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణలో 6,79,064కి చేరిన సంఖ్య

వీరిది love marriage. అప్పలరాజు, సంధ్య ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదురించి యేడాది కిందట వీరు వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి చనిపోవడంతో వీరు ఎవరో కావాలనే చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా అక్టోబర్ లో ఇలాంటి దారుణ ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది.  Guntur జిల్లాలోని ప్రభుత్వ hospital నుంచి మూడు రోజుల పసికందును దుండగులు kidnap చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.

గుంటూరు సమీపంలోని పెదకాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 12న జీజీహెచ్ ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రియాంకకు బాలుడు జన్మించాడు. ఆ శిశువును తాత, అమ్మమ్మలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 15వ తేదీ అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో బాబును వార్డు బయటకు తీసుకువచ్చారు. అక్కడే కాసేపు ఆడించారు. అనంతరం బాబును పక్కనే ఉంచుకుని నిద్రపోయారు.

ఇదే అదనుగా కొందరు దుండగులు తమ పథకం అమలు చేశారు. ఆ వృద్ధుల పక్కనే పడుకున్న శిశువును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. కాసేపటికి మెలకువకు వచ్చిన ఆ ముసలివాళ్లు పక్కన బాబు లేకపోవడంతో హతాశయులయ్యారు. వెంటనే జీజీహెచ్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios