తెలంగాణ (Telangana)లో కొత్తగా 190 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 195 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,805 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 40,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 190 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,79,064కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కోవిడ్ వల్ల ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయిన వారి సంఖ్య 4,012కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 195 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రికవరీల సంఖ్య 6,71,247కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 3,805 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 6,764 మంది ప్రయాణికులు తెలంగాణకు రాగా.. వారిలో 21 మందికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం అధికారులు ల్యాబ్‌కు పంపించారు. వాటిలో ఇప్పటికే 17 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా తేలగా.. ఏడుగురికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 80, జగిత్యాల 3, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 7, ఖమ్మం 10, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 10, మంచిర్యాల 4, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 13, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 8, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 3, సిరిసిల్ల 2, రంగారెడ్డి 14, సిద్దిపేట 2, సంగారెడ్డి 7, సూర్యాపేట 2, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 12, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…