Asianet News TeluguAsianet News Telugu

హామీలు అమలు చేయాల్సిందే.. - బీఆర్ఎస్.. ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బుక్ లెట్ విడుదల..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు, అలాగే పలు డిక్లరేషన్ సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఒక బుక్ లెట్ ప్రచురించింది. దానిని నేడు విడుదల చేసింది. 

Guarantees must be implemented.. - BRS released a booklet titled 'Congress 420 Guarantees'..ISR
Author
First Published Jan 3, 2024, 4:52 PM IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆచరణకు సాధ్యం కాని, మోసపూరిత హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించింది. వందల కొద్దీ హామీలు ఇచ్చిందని, కానీ ప్రస్తుతం కేవలం 6 హామీలే జపిస్తోందని విమర్శించింది. కానీ అన్ని హామీలు తమ పార్టీ గుర్తు చేస్తుందని తెలిపింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోతో పాటు పలు డిక్లరేషన్ల సందర్భంగా ఇచ్చిన  హామీలను గుర్తు చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ‘కాంగ్రెస్ 420 హామీలు’ ఒక బుక్ లెట్ విడుదల చేసింది.

ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు ఒవైసీ ప్రయత్నం - బండి సంజయ్

కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ విమర్శించింది. కానీ ప్రస్తుతం వాటిని ఈరోజు వాటి అమలుపైన ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్లెట్ ని తయారు చేశామని పేర్కొంది. వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాత్రం కేవలం ఆరు హామీల మాట జపిస్తుందని ఆరోపించింది. 

కర్ణాటకలో గోద్రా తరహా ఘటన జరగొచ్చు - కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఇచ్చింది ఆరు హామీలు కాదని, 420 హామీలు అంటూ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు ముందుగానే.. మోసానికి మారుపేరుగా నిలిచే 420 నెంబర్ తో ఈ హామీలు ఇచ్చిందని తీవ్రంగా విమర్శించింది.  ఇప్పటికైనా హామీలను వెంటనే అమలు చేసేలా కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించింది. లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే వీటిని అమలు చేయాలని పేర్కొంది. 

420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తుందని పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios