తలకొండపల్లి: తెల్లవారితే పెళ్లి కుటుంబసభ్యులంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో వరుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నాగర్‌కర్నూల్ జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామంలో  ఈ విషాదం చోటు చేసుకొంది. మెదక్‌పల్లి గ్రామానికి చెందిన పల్లెజర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కొడుకు శ్రీకాంత్ గౌడ్ కు కందుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. అదే గ్రామంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి వద్ద పెళ్లికి సంబంధించి పందిరి వేసేందుకు  కుటుంబసభ్యులు వెళ్లారు.  పందిరి వేసేందుకు వెళ్లే ముందు శ్రీకాంత్ గౌడ్ వద్దకు వెళ్లిన ఆయన సోదరుడు  ఆయనను నిద్రలేపి పందిరికి అవసరమైన మెటీరియల్ తీసుకెళ్లేందుకు బైక్ పై వెళ్లాడు.  

కొద్దిసేపటికే శ్రీకాంత్ గౌడ్  ఉన్న పాత నివాసం వద్దకు ఆయన సోదరుడు రాజు వచ్చేసరికి శ్రీకాంత్ గౌడ్  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ ఘటన గ్రామంలో  విషాదం నెలకొంది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ గౌడ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.