Asianet News TeluguAsianet News Telugu

నేడు జీఆర్ఎంబీ సమావేశం: తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చ

నేడు జీఆర్ఎంబీ సమావేశం హైద్రాబాద్ లో నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో కీలక అంశాంపై చర్చించనున్నారు.గత సమావేశానికి ఏపీకి చెందిన అధికారులు హాజరు కాకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

GRMB full body to  meet today in Hyderabad
Author
Hyderabad, First Published Mar 13, 2022, 9:46 AM IST


 హైదరాబాద్: ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం Hyderabadలోని జీఆర్ఎంబీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. గత వారంలో నిర్వహించాల్సిన సమావేశం Andhra Pradesh  రాష్ట్రానికి చెందిన  ప్రతినిధులు హాజరు కాకపోవడంతో అర్ధాంతరంగా వాయిదా పడింది.జీఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండానే ఏపీకి చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి గైర్హాజర్ కావడంపై  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో గత శుక్రవారం నాడు జరగాల్సిన సమావేశాన్ని ఇవాళ్టికి వాయిదా వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. తెలంగాణలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే Andhra Pradesh Assembly సమావేశాల నేపథ్యంలో బోర్డు సమావేశాన్ని తర్వాత ఏర్పాటు చేయాలని ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు GRMB అధికారులకు మౌఖికంగా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఈ సమాచారం ఆధరంగానే ఏపీకి చెందిన అధికారులు ఈ నెల 11న జరగాల్సిన జీఆర్ఎంబీ సమావేశానికి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. అయితే జీఆర్ఎంబీ సమావేశం ఉందని Telangana అధికారులు మీటింగ్ కు హాజరయ్యారు. ఎంతకీ ఏపీకి చెందిన అధికారులు రాకపోవడంతో జీఆర్ఎంబీ అధికారులు ఆరా తీశారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరు కాలేదని సమాచారం రావడంతో Telangana ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులు హాజరౌతారా లేదా 2అనే విషయాన్నితెలుసుకొన్న తర్వాతే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని Rajath Kumar జీఆర్ఎంబీ అధికారులక సూచించారు.

 Godavari నదిపై  తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టుల DPR లను టెక్నికల్ కమిటీ పరిశీలించనుంది. ఆ తర్వాత టెక్నికల్ అడ్వయిజరీ కమిటీకి, అపెక్స్ కౌన్సిల్ కు పంపనుంది. దీంతో పాటు ఇతర అంశాలను చర్చించనున్నారు. 

అంతకుముందు గత ఏడాది అక్టోబర్ మాసంలో జీఆర్ఎంబీ సమావేశం జరిగింది.  జీఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి.

 పెద్దవాగు నుంచి Gazette ను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని జీఆర్ఎంబీ ప్రతిపాదించింది. దీనికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మరో వైపు ఈ ప్రాజెక్టుతో పాటు మరో రెండు ప్రాజెక్టుల విషయమై రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి.

ఇదిలా ఉంటే  ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపకుండా బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకు రావడంపై తెలంగాన ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.  ఈ విషయమై తెలంగాణలోని ప్రాజెక్టులను నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖను కోరుతుంది. 

బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకు రావడంపై తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల శాఖ ఇరిగేషన్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను ఏర్పాటు చేసే వషయమై  ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లపై ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్దుంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ఏ రకంగా స్పందిస్దుందనేది తేలనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios