జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పాతబస్తీలో హైఅలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రదేశం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పాతబస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.  

పాతబస్తీలో మొత్తం 590 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 387 ఉన్నాయి.  ఈ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. 

70వేల సీసీకెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసారు.  స్పెషల్ ట్రాకింగ్ టీమ్, రూట్ మొబైల్ టీమ్ లను కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.  గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

గతంలో పురానాపూల్, శాలిబండ ఏరియాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో అలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.  రీపోలింగ్, క్రాస్ పోలింగ్ జరగకుండా ఉండేందుకు అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు.