నిరుద్యోగుల వత్తిడికి దిగివచ్చిన తెలంగాణ సర్కార్ ఫారెస్ట్ ఉద్యోగాల వయో పరిమితి పెంపు  వయోపరిమితి పెంపు  ఫైలుకు సిఎం కేసిఆర్ ఆమోదం 

తెలంగాణ నిరుద్యోగుల వత్తిడి ఫలించింది. సర్కార్ దిగొచ్చింది. వయోపరిమితిని పెంచాలని కోట్లాడుతున్న నిరుద్యోగుల విన్నపాన్ని సర్కారు అంగీకరించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ( ఎఫ్ ఆర్ ఓ ) ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు వయో పరిమితిని మూడు సంవత్సరాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన దస్త్రం పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు బుధవారం టి ఎస్పీఎఎస్సి కి లేఖ రాశారు. 28 సంవత్సరాల వయస్సు నిర్ణయం వల్ల తాము ఎఫ్ ఆర్ ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేయలేక పోతున్నామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు గోడు వెళ్లబుచ్చు కున్నారు.

ఈ విషయాన్ని మంత్రి వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు .. దీంతో సీఎం కేసీఆర్ వయో పరిమితిని 28 నుంచి 31 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు . Online దరఖాస్తు గడువును పెంచాలని టీఎస్ పీ ఎస్సి కి అధికారులు బుధవారం లేఖ రాశారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు నిరుద్యోగ అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు అని ఫారెస్టు శాఖ ఒక పత్రికా ప్రకటన వెలువరించింది.