సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు ఓవరాక్షన్ చేశారు. గురువారం సమ్మె ఉందంటూ రోగులను వైద్యులు వెనక్కిపంపారు. ఇదేంటంటూ కొందరు రోగులు వైద్యులను నిలదీయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

అయితే పేషెంట్స్ తమపై దాడి చేశారంటూ డాక్టర్లు ఎదురుదాడికి దిగారు. ఓ దివ్యాంగుడు తమపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ అతనితో కాళ్లు మొక్కించుకున్నారు. బాధితుడు కాళ్లు పట్టుకున్నప్పటికీ వారు వైద్యం చేయలేదు.

సదరు రోగి దివ్యాంగుడని కూడా చూడకుండా వారు కాళ్లు మొక్కించుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎన్‌సీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.