ఉప్పల్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం

Govt announces compensation to the family of the dead
Highlights

ప్రభుత్వ ప్రకటన

ఉప్పల్ లో మ్యాన్ హోల్ లో పడి మరణించిన కార్మికులకు చెరో 10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది ఎల్ అండ్ టి సంస్థ. బుధవారం ఉదయం ఉప్పల్ స్టేడియం దగ్గర జరిగిన వాటర్ పైప్ లైన్ ఇన్స్పెక్షన్ ఛాంబర్ పడి ఎల్ & టి సంస్థకు చెందిన  ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటనలో జలమండలి డైరెక్టర్ టెక్నికల్ శ్రీ సత్య సూర్యనారాయణను విచారణ అధికారిగా నియమించినట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. దానకిషోర్ తెలిపారు. ఈ ఇద్దరు కార్మికులు  ఒరిస్సా  ప్రాంతానికి చెందిన వారు అని తెలిపారు.

చనిపోయిన కార్మికులకు చెరో 10 లక్షల పరిహారాన్ని తక్షణమే చెల్లిస్తున్నట్లు ఎండీ  తెలిపారు. ఈ వాటర్ పైప్ లైన్ 1300 ఎం.ఎం. డయా తో 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు మరియు 2 మీటర్ల లోతు తో వాటర్ సప్లై కు సంబంధించిన ఇన్స్పెక్షన్ ఛాంబర్ ను ఎల్ & టి సంస్థ నిర్మిస్తున్నది. నిర్మాణంలో వున్న ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్  ఇంకా ప్రారంభం కాలేదు. ఇద్దరు కార్మికుల మృతికి కారణమై,   పనుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహిరించిన ఎల్ & టి సంస్థ, సంబంధిత అధికారులపై  తగు చర్యలు తీసుకుంటామని శ్రీ దానకిషోర్ ఈ సందర్బంగా తెలిపారు.

చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు శ్రీ దానకిషోర్  తమ సంతాపాన్ని తెలియచేసారు.

కార్మికులు మరణించిన తాలూకు వీడియో కింద ఉంది చూడండి.
"

loader