నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్న గవర్నర్ తమిళిసై.. వివరాలు ఇవే..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఆర్మీ మెమోరియల్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొంటారని సమాచారం. అయితే మునుగోడు ఉప ఎన్నిక, తెలంగాణలో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.