తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై ప్రయాణిస్తున్న వాహనం హైదరాబాద్‌‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై ప్రయాణిస్తున్న వాహనం హైదరాబాద్‌‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీంతో ఆమె కాన్వాయ్ కాసేపు రోడ్డుపైనే నిలిచిపోవాల్సి వచ్చింది. వివరాలు.. గవర్నర్ తమిళిసై సోమవారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వచ్చారు. అయితే యూటర్న్ తీసుకునే సమయంలో ట్రాఫిక్‌లో గవర్నర్ తమిళిసై కాన్వాయ్ నిలిచిపోయింది. ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇలా జరిగింది. 

గవర్నర్ తమిళిసై కాన్వాయ్‌కు వెంటనే యూటర్న్ తీసుకోవడం కుదరలేదు. దీంతో వెంటనే గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది.. కాన్వాయ్‌లో నుంచి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. యూటర్న్ వద్ద వాహనాలను కొద్దిసేపు వాహనాలను నియంత్రంచడంతో.. గవర్నర్ తమిళిసై కాన్వాయ్ ముందుకు కదిలింది. ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది.