తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఆమోదం పొందిన తర్వాత.. తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను తిప్పిపంపగా.. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలినకు పంపినట్టుగా తెలుస్తోంది. ఇంకో మూడు బిల్లులను తన వద్దే పెండింగ్‌లో ఉంచారు. పరిశీలన తర్వాత వాటిపై గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించింది.. ఏ బిల్లలను తిప్పి పంపారనే వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక, తెలంగాణ గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు విచారణకు రానున్న నేపథ్యంలో.. గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.