Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు: కోదండరామ్, అమరుల్లాఖన్ లను నియమించిన గవర్నర్


గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లాఖాన్ లను  గవర్నర్ నియమించారు.

governor quota mlc:Telangana Governor Tamilisai soundararajan  appointed kodandaram and amarullah khan as MLCs lns
Author
First Published Jan 25, 2024, 3:25 PM IST

హైదరాబాద్:  గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్  నియమించారు  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరామ్,  అమరుల్లాఖాన్ పేర్లను  రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు  సిఫారసు చేసింది.ఈ సిఫారసుకు గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు.

2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను   గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా  సిఫారసు చేస్తూ అప్పటి భారత రాష్ట్ర సమితి  నేతృత్వంలోని  కేసీఆర్ సర్కార్ గవర్నర్ కు సిఫారసు చేసింది.  అయితే  2023 సెప్టెంబర్  25న  ఈ ఇద్దరి పేర్లను  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.  నిబంధనల మేరకు  వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని  గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.   

also read:టీఎస్‌పీఎస్‌పీ నూతన చైర్మెన్ మహేందర్ రెడ్డి: గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర

ఇదిలా ఉంటే గత ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  దీంతో గతంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  రెండు స్థానాలకు  ప్రొఫెసర్ కోదండరామ్,  అమరుల్లాఖన్ ల పేర్లను  కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసింది.ఈ సిఫారసు మేరకు ఈ ఇద్దరి పేర్లను  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం పలువురి పేర్లు  పరిశీలనకు వచ్చాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి  చీఫ్ కోదండరామ్ మద్దతును ప్రకటించారు. దీంతో కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది.ఈ క్రమంలోనే ఎమ్మెల్సీని ఇచ్చారు. మరో వైపు  అలీ మస్కతి,జాఫర్ జావీద్, షబ్బీర్ అలీ పేర్లు కూడ పరిశీలనకు వచ్చాయి. అయితే  షబ్బీర్ అలీకి  ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. దరిమిలా ఎమ్మెల్సీ రేస్ నుండి ఆయన వైదొలిగారు.రాష్ట్రంలోని 54 కార్పోరేషన్లకు  చైర్మెన్లను కూడ త్వరలోనే నియమించనున్నారు.  పార్లమెంట్ ఎన్నికల నాటికి  నామినేటేడ్ పదవుల భర్తీతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios