అనంతగిరి కొండల్లో గవర్నర్ నర్సింహన్ దంపతులు

governor narsimhan couple visits anantagiri hills
Highlights

స్వాగతం పలికిన మంత్రి పట్నం

వికారాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు అనంతగిరి కొండల్లో పర్యటించారు. వారికి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. వేసవి విడిదిలో భాగంగా వికారాబాద్ జిల్లాలో ని అనంతగిరి కొండల్లోని హిల్ స్టేషన్ ను సందర్శించారు గవర్నర్ దంపతులు. ఈ సందర్భంగా హరిత  పర్యాటక కేంద్రం లో గవర్నర్ నరసింహన్ దంపతులు విడిది చేశాడు.

శుక్రవారం సాయంత్రం గవర్నర్ తిరిగి ప్రయాణం అవ్వాలి ఉండగా జిల్లా మంత్రి గా మహేందర్ రెడ్డి, కలెక్టర్ ఓమర్ జలీల్, జేసీ,ఎస్పీ అన్నపూర్ణ తదితరులు గవర్నర్ నరసింహన్ ను కలిసి బోకే అందించారు.

 అనంతరం కాసేపు వారు కుశల ప్రశ్నలు వేసుకొని  అనంతగిరి విశేషాలు చర్చించారు. అనంతపద్మనాభ దేవాలయం వైశిష్ట్యం, ప్రకృతి రమణీయత, మంచి స్వచ్ఛమైన గాలితో

 అనంతగిరి కా హవా లాఖో రూపాయికా దవా గా పేరుగాంచిందని మంత్రి మహేందర్ రెడ్డి వివరించారు. అనంతరం గవర్నర్ దంపతులు రాజధాని హైదరాబాద్ తరలారు.

loader