హైదరాబాద్‌ ప్రజలంతా మెట్రో రైలు సేవలు వినియోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ పిలుపునిచ్చారు. అమీర్‌పేట నుంచిఎల్బీనగర్‌ మెట్రో రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్ అక్కడి నుంచి మెట్రో రైలులో ఎల్బీనగర్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రజలంతా మెట్రో రైలు సేవలు వినియోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ పిలుపునిచ్చారు. అమీర్‌పేట నుంచిఎల్బీనగర్‌ మెట్రో రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్ అక్కడి నుంచి మెట్రో రైలులో ఎల్బీనగర్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. 

మెట్రో రైలులో ప్రయాణించడం ద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించవచ్చునని గవర్నర్ నరసింహన్ తెలిపారు. త్వరలోనే మెట్రో స్టేషన్లలో ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్ల ఎంతో సుందరంగా ఉన్నాయని భవిష్యత్తులో వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. మెట్రో ప్రయాణికులను సాధ్యమైనంత త్వరగా సింగిల్‌ కార్డు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

 మరోవైపు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అమీర్ పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు సేవలను గవర్నర్ నరసింహన్ తో కలిసి ప్రారంభించిన కేటీఆర్ ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. మెట్రో స్టేషన్ల నిర్మాణంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు. ప్రజలు నడక మార్గాల ద్వారా మెట్రో స్టేషన్లకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్‌ మెట్రోకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌ అండ్‌ టీ రూ.12వేల కోట్లు ఖర్చు చేసిందని, భూ సేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించిందని కేటీఆర్ అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రో‌ను ప్రారంభించిన గవర్నర్