హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ దంపతులు శుక్రవారం నాడు  రాజ్‌భవన్‌లో సమీపంలోని 114 పోలింగ్ స్టేషన్‌లో  ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

రాజ్ భవన్‌కు సమీపంలోని  రాజ్‌నగర్ వేల్పేర్ అసోసియేషన్  కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసిన   114 పోలింగ్ స్టేషన్‌లో గవర్నర్  దంపతులు  తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు.

ఈ పోలింగ్ బూత్  ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. ఓటు హక్కును వినయోగించుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహాన్ మీడియాతో మాట్లాడారు.

ఓటు వేయాల్సిన బాధ్యత అందరిదని గవర్నర్ నరసింహన్ కోరారు.  సెలవులున్నాయని ఓటు వేయకుండా వెళ్లకూడదని  గవర్నర్ ప్రజలను కోరారు. ఓటు వేసిన తర్వాత  సెలవులను వినియోగించుకోవాలని ఆయన కోరారు.