తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నర్సింహన్..నయా రికార్డ్ సృష్టించారు. మొత్తం భారతదేశంలో ఎక్కువ కాలం గవర్నర్ పదవి చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డులు సృష్టించారు.

ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నర్సింహన్.. ఇటు రెండు రాష్ట్రాలకు.. అటు కేంధ్రానికి వారదిలా ఉంటూ వస్తున్నారు. ఆయనను గవర్నర్ గా నియమించిన ప్రభుత్వం మారినా... ఆయన మాత్రం గవర్నర్ గానే కొనసాగడం గమనార్హం.

నర్సింహన్... తొలిసారిగా  2007 జవనరి 5వ తేదీన ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు సంవత్సరాల పాటు అక్కడ ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2009 డిసెంబర్ 27న ఉమ్మడి ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన గవర్నర్ గా కొనసాగుతూనే ఉన్నారు.

గవర్నర్ పదవిలో ఆయన మొత్తంగా 11 సంవత్సరాల నాలుగు నెలలు.. విధులు నిర్వహించగా..  అందులో 9 సంవత్సరాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకే కేటాయించారు.  

గతంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ గా సరోజినీ నాయుడు కుమార్తె పద్మజా నాయుడు పది సంవత్సరాల 7నెలలు గవర్నర్ గా విధులు నిర్వహించారు. ఆమె పేరుమీద ఈ రికార్డు ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ సైతం 9సంవత్సరాల 4 నెలలుగా ఆయన పదవి భాద్యతలు నిర్వహిస్తున్నారు. మరో సంవత్సరం పాటు ఆయన ఇక్కడ పదవిలో ఉంటే ఓకే చోట ఎక్కువ కాలం పనిచేసిన గవర్నర్ గా కూడ రికార్డ్ బద్దలు కొడతారు నర్సింహన్