Asianet News TeluguAsianet News Telugu

విషాదం... బ్లాక్ ఫంగస్ తో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కరోనా నుండి బయటపడ్డా బ్లాక్ ఫంగస్ కబళించింది.

government teacher death with black fungus akp
Author
Mancherial, First Published May 24, 2021, 12:38 PM IST

మంచిర్యాల: ఇప్పటికే కరోనా మరణ మృదంగం సృష్టిస్తుంటే తాజాగా బ్లాక్ ఫంగస్ మరణాలు కూడా మొదలయ్యాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కరోనా నుండి బయటపడ్డా బ్లాక్ ఫంగస్ కబళించింది.

మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన గుజ్జుల వీరేశం(49) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇటీవలే అతడు కరోనా బారినపడ్డా సురక్షితంగా బయటపడ్డాడు. అయితే బ్లాస్ ఫంగన్ మాత్రం అతడి ప్రాణాలను బలితీసుకుంది. బ్లాక్ ఫంగన్ బారినపడ్డ అతడు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

read more  తెలంగాణలో విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్: ఆయుష్ వైద్యులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ

మరోవైపు కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించింది. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా 2,242 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించింది. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా 2,242 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 5,53,277కి చేరింది.

కొత్తగా మరో 19 మంది మహమ్మారికి బలవ్వగా.. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 3125కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌‌లో తెలిపింది. ఇవాళ 4,693 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరోవైపు తెలంగాణలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 343 మందికి పాజిటివ్‌గా తేలింది. 

 ఇక జిల్లా వారిగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 11, భద్రాద్రి కొత్తగూడెం 42, జగిత్యాల 71, జనగామ 16, జయశంకర్ భూపాల్‌పల్లి 20, జోగులాంబ గద్వాల్ 63, కామారెడ్డి 12, కరీంనగర్ 165, ఖమ్మం 123, కొమరంభీం ఆసిఫాబాద్ 13, మహబూబ్‌నగర్ 134, మహబూబాబాద్ 57, మంచిర్యాల 46, మెదక్ 20, మేడ్చల్ మల్కాజ్‌గిరి 146, ములుగు 16, నాగర్‌కర్నూల్ 57, నల్గొండ 32, నారాయణ్ పేట్ 23, నిర్మల్ 7, నిజామాబాద్ 30, పెద్దపల్లి 50, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 174, సంగారెడ్డి 83, సిద్దిపేట 94, సూర్యాపేట 63, వికారాబాద్ 87, వనపర్తి 55, వరంగల్ రూరల్ 61, వరంగల్ అర్బన్ 87, యాదాద్రి భువనగిరిలో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి.  


 

Follow Us:
Download App:
  • android
  • ios