హైదరాబాద్; కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసిన  గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. గాంధీ ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా తప్పుడు ప్రచారం చేసిన డాక్టర్‌ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సోమవారం నాడు సరెండర్ చేసింది సర్కార్.

హైద్రాబాద్‌లోని గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో కరోనా అనుమానితులకు చికిత్స చేయించేందుకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ రెండు ఆసుపత్రుల్లో సుమారు 70 మంది కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిని వైద్యులు తమ అబ్జర్వేషన్లలో ఉంచారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ముడి సరుకుకొరత..సవాళ్ల ముంగిట ఫార్మా ఇండస్ట్రీ

గాంధీ ఆసుపత్రి క్యాజువాలిటీలో పనిచేస్తున్న ఓ వైద్యుడు కరోనా వైరస్  రెండు పాజిటివ్ కేసులు ఉన్నట్టుగా  మీడియాకు సమాచారం లీక్ చేసినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. 

రెండు రోజుల క్రితం ఇద్దరికి కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చినట్టుగా కొన్ని మీడియాల్లో ప్రచారం సాగింది. దీన్ని సీరియస్‌గా తీసుకొన్న ప్రభుత్వం విచారణ చేసిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. 

మీడియాలో ఈ వార్తలు రావడానికి ఓ డాక్టర్ ఇచ్చిన సమాచారమే కారణంగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన డాక్టర్‌పై సర్కార్ వేటు వేసింది. ఆ డాక్టర్‌ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సోమవారం నాడు సరెండర్ చేసింది.