Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్: ఎంబీబీఎస్, బీడీఎస్ బీ కేటగిరి ఆడ్మిషన్లలో 85 శాతం తెలంగాణకే

ఎంబీబీఎస్, బీడీఎస్ ఆడ్మిషన్లలో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంతో తెలంగాణ విద్యార్ధులకు మెడికల్ ఆడ్మిషన్లలో మెజారిటీ సీట్లు దక్కనున్నాయి. 

Government Amendments MBBS,BDS Admissions to 85 percent Seats For Telangana Students
Author
First Published Sep 29, 2022, 1:21 PM IST

హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ఆడ్మిషన్లలో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీ కేటగిరి సీట్లలో 85 శాతం  తెలంగాణ విద్యార్ధులకే దక్కేలా  నిబంధనలను సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ బి కేటగిరి సీట్లలో 35 శాతం సీట్లలో మెజారిటీ సీట్లు (85శాతం) తెలంగాణ విద్యార్ధులకే దక్కేలా వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు మార్చింది. ఈ మేరకు గురువారం నాడు 129, 130 జీవోలను విడుదల చేసింది.  రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్ధులకు దక్కనున్నాయి. 

 రాష్ట్రంలో 20  మైనారిటీ, 4 నాన్ మైనారిటీ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనార్టీ కాలేజీల్లో 3200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నిబంధనలు మార్చడంతో  బి కేటగిరీలో ఉన్న 952 సీట్లు తెలంగాణ విద్యార్ధులకే దక్కనున్నాయి. 

 మిగిలిన15 శాతం సీట్లలోనే ఇతర రాష్ట్రాల విద్యార్ధులు ఆడ్మిషన్లు తీసుకొనే అవకాశం ఉంది. దీంతో 168 సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఉంటాయి. ఈ ఓపెన్ కోటాలోనే ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడుతారు. ఓపెన్ కోటాలో కూడా తెలంగాణ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనార్టీ కాలేజిల్లో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. 

 రాష్ట్రంలో మేనేజ్ మెంట్  కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు లేదు. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. ఈ విషయమై  ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం  చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. 

మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిషా, మధ్య ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేశారు. రాష్ట్ర విద్యార్ధులకు న్యాయం చేసేందుకు వీలుగా ఆడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం.   తాజా నిర్ణయం తో  1,068 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ విద్యార్ధులకు న్యాయం జరగనుంది. ఎంబీబీఎస్ విద్య కోసం ఇతర రాష్ట్రాలు సహా  ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఇక్కడి విద్యార్ధులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
ఇందులో భాగంగా బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 85 శాతానికి కు పెంచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios