తెలంగాణను అడ్డుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్ ను కేసీఆర్ పెట్టారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆయన ఆరోపించారు.

హుజారాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ డబ్బు గెలుస్తుందో లేక ఈటల రాజేందర్ గెలుస్తాడో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ . శుక్రవారం ఉదయం బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్ర పేరును ప్రజా సంగ్రామ యాత్రగా రాజాసింగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రక్తాన్ని కేసీఆర్ కుటుంబం తాగుతోందని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో బీజీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర సాగుతుందని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

తెలంగాణను అడ్డుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్ ను కేసీఆర్ పెట్టారని రాజాసింగ్ విమర్శించారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్తుంటే ఆపే దమ్ము కూడా కేసీఆర్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.