Asianet News TeluguAsianet News Telugu

గురువారం చంద్రముఖిని కోర్టులో హాజరుపర్చాల్సిందే: పోలీసులకు హైకోర్టు ఆదేశం

తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి బీఎల్ఎఫ్ తరపున బరిలో నిలిచిన ట్రాన్స్ జెండర్ చంద్రముఖి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఆమె కిడ్నాప్ పై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తమ కూతురి ఆచూకిని వెంటనే గుర్తించాలంటూ ఆమె తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.  

goshamahal blf contestant chandramukhi missing case
Author
Goshamahal, First Published Nov 28, 2018, 3:55 PM IST

తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి బీఎల్ఎఫ్ తరపున బరిలో నిలిచిన ట్రాన్స్ జెండర్ చంద్రముఖి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఆమె కిడ్నాప్ పై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తమ కూతురి ఆచూకిని వెంటనే గుర్తించాలంటూ ఆమె తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.  

పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు హైకోర్టు ఈ కేసుపై అత్యవసర విచారణ చేపట్టింది. హెబియస్ కార్పస్ పిటిషన్ స్వీకరిస్తున్నట్లు తెలిపిన కోర్టు రేపు(గురువారం) ఉదయం 10.15  గంటలకల్లా చంద్రముఖిని కోర్టు ముందు హాజరుపర్చాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. 

చంద్రముఖిని మిస్సింగ్ పై అందిన పిర్యాదులో ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. ఆము ఆచూకీ  కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆమె ఎక్కడికైనా వెళ్లిందా అన్న కోణంలో  పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కావడంతో రాజకీయంగా కూడా ఈమె మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది.  

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి చంద్రముఖి. అన్ని పార్టీలతోపాటు చంద్రముఖి కూడా తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే ఒక్కసారిగా ఆమె మిస్సింగ్ అవ్వడం అటు బీఎల్ఎఫ్ అభ్యర్థులతోపాటు కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నవంబర్ 27 తెల్లవారు జామున రాత్రి మూడు గంటల నుండి ఆమె కనిపించడంలేదంటూ తోటి ట్రాన్స్ జెండర్స్ తో పాటు కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పొలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. 

 గోషామహల్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్మే రాజాసింగ్ బిజెపి అభ్యర్థిగా, సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ  మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ ఉద్దండులతో పోటీ పడుతూ అందరి దృష్టి ఆకర్షిస్తున్న ట్రాన్స్ జెండర్ చంద్రముఖి మిస్సింగ్ అవ్వడం సంచలనంగా మారింది.  

మరిన్ని  వార్తలు

వీడని సస్పెన్ష్...గోషామహాల్ చంద్రముఖి ఏమైంది: విషయం హైకోర్టుకి

గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్నాప్...

గోషామహాల్ నుండి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి బరిలోకి

గోషామహల్ లో ట్రాన్స్ జెండర్ చంద్రముఖి ప్రచారం (ఫొటోలు)
 

 

Follow Us:
Download App:
  • android
  • ios