తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటివనకు అభ్యర్థుల మధ్య మాటల యుద్దం కొనసాగగా ప్రస్తుతం ప్రత్యక్ష యుద్దం మొదలయ్యింది. ఏకంగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్నాప్ కు గురైన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ  చేస్తున్న ఏకైక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి ఇలా కిడ్నాప్ కు గురవడంతో తీవ్ర కలకలం రేగుతోంది.

హైదరాబాద్ గోషామహల్ లో బిఎల్ఎఫ్ పార్టీ అభ్యర్థిగా చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ ఫోటీ చేస్తున్నారు. ఈమె బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిర నగర్లో నివసముంటున్నారు. అయితే ఇవాళ రాత్రి మూడు గంటల నుండి ఆమె కనిపించడంలేదంటూ తోటి ట్రాన్స్ జెండర్స్ బంజారాహిల్స్ పొలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఇద్దరూ గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమెతో మాట్లాడాలని చెప్పి తీసుకువెళ్లారని...అలా తీసుకెళ్లిన ఆమెను ఇప్పటివరకు తీసుకురాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కిడ్నాప్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రముఖి కోసం గాలిస్తున్నారు. ఆమెను తెలిసినవారే కిడ్నాప్ చేసి వుంటారని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

గోషామహల్ నుండి వివాదాస్పద మాజీ ఎమ్మెల్మే రాజాసింగ్ బిజెపి, సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ  మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఇలా రాజకీయ ఉద్దండులతో పోటీ పడుతున్న ట్రాన్స్ జెండర్ కిడ్నాప్ కు గురవడం సంచలనంగా మారింది.

మరిన్ని వార్తలు

గోషామహాల్ నుండి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి బరిలోకి

గోషామహల్ లో ట్రాన్స్ జెండర్ చంద్రముఖి ప్రచారం (ఫొటోలు)