హైదరాబాద్:  గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుండి  బీఎల్ఎఫ్  ట్రాన్స్‌జెండర్ మువ్వల చంద్రముఖి ని బరిలోకి దింపింది.బీఎల్ఎఫ్  ఇప్పటికే  సుమారు 106 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఎల్ఎఫ్ ప్రకటించిన జాబితాలో 52 మంది బీసీలకు టికెట్లు కేటాయించింది.

అయితే గ్రేటర్ హైద్రాబాద్‌ పరిధిలోని గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుండి  చంద్రముఖిని బీఎల్ఎఫ్ బరిలోకి దింపుతోంది.  చంద్రముఖి ట్రాన్స్‌జెండర్. చంద్రముఖి ఉన్నత విద్యను అభ్యసించినట్టు బీఎల్ఎఫ్ ఛైర్మెన్  తమ్మినేని వీరభద్రం చెప్పారు.  అయితే  తమకు ఏ రాజకీయ పార్టీ కూడ టికెట్టు ఇవ్వలేదని చెప్పారు.

ప్రధాన పార్టీల నుండి పోటీ  చేసేందుకు చివరివరకు ప్రయత్నించిన అభ్యర్థులు  టికెట్లు దక్కకపోవడంతో చివరికి బీఎల్ఎఫ్ నుండి పోటీకి దిగుతున్నారు.