బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. బొల్లారం దాడి కేసులో ఆయనకు ఏడాది శిక్ష విధిస్తూ నాంపల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 

బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. బొల్లారం దాడి కేసులో ఆయనకు ఏడాది శిక్ష విధిస్తూ నాంపల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోలీసులపై దాడి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణపై రాజాసింగ్ మీద 2015లో కేసు నమోదైంది. రాజాసింగ్ బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు కూడా. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో రాజాసింగ్ సీఐని దూషించారంటూ కేసు నమోదైంది. 

అంతకు ముందు కూడా రాజాసింగ్ మీద కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మీద దాడిచేయడమే కాకుండా చంపేస్తానంటూ కూడా బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.