Asianet News TeluguAsianet News Telugu

లోక్ సభ బరిలో గోరటి వెంకన్న? నాగర్ కర్నూల్ నుంచి పోటీకి దిగనున్నారా?

‘గల్లీ చిన్నదీ.. గరీబోళ్ల కథ పెద్దది..’ అంటూ.. తన పాటలతో అందరి హృదయాల్నీ గెలుచుకున్న గాయకుడు గోరేటి వెంకన్నకు నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ టికెట్ ను కేటాయించే విషయంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Gorati Venkanna in Lok Sabha? Will contest from Nagarkurnool? - bsb
Author
First Published Jan 3, 2024, 8:56 AM IST


హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన బిఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా.. అసెంబ్లీ ఎన్నికల జోష్ ను లోక్సభ ఎన్నికల్లోనూ  కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ లోక్సభ ఎన్నికల మీద కసరత్తు మొదలు పెట్టేసింది. గెలుపు గుర్రాల కోసం వేట మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే గాయకుడు గోరటి వెంకన్నకు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ను కేటాయించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం.

‘గల్లీ చిన్నదీ.. గరీబోళ్ల కథ పెద్దది..’ అంటూ.. తన పాటలతో అందరి హృదయాల్నీ గెలుచుకున్న గాయకుడు గోరేటి వెంకన్నకు నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ టికెట్ ను కేటాయించే విషయంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో .. కెసిఆర్ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.  మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కెసిఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని బీఆర్ఎస్ ఇన్చార్జుల అభిప్రాయాలు అడగగా.. వారందరూ గోరటి వెంకన్నకు మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. గోరటి వెంకన్న అభ్యర్థిత్వంపై మాజీ ఎమ్మెల్యేలు కూడా సానుకూలతను వ్యక్తం చేశారట.

Revanth Reddy: తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి! సీఎం రేవంత్‌తో శంకరమ్మ భేటీ

నాగర్ కర్నూల్ నుంచి  ప్రస్తుతం పోతుగంటి రాములు ఎంపీగా ఉన్నారు. ఆయనకు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలోనే అనూహ్యంగా గోరటి వెంకన్న పేరు తెరమీదికి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు,ఎంపీ పోతుగంటి రాములుకు మధ్య జెడ్పీ చైర్మన్ ఎంపిక విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. పోతుగంటి రాములు కుమారుడికి జెడ్పి చైర్ పర్సన్ పదవి దక్కి అవకాశం ఉంది. అయితే, అలా దక్కకుండా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో సహా మరి కొంతమంది తమకు వ్యతిరేకంగా పనిచేశారని రాములు ఇదివరకే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

దీనికి ప్రతిగా గువ్వల బాలరాజు మరికొంతమంది ఎమ్మెల్యేలు.. ఈసారి ఎంపీ సీటును రాములకు కేటాయించొద్దని బీఆర్ఎస్ అధిష్టానానికి తెలిపారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో… అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జరిగిన తప్పే లోక్ సభ ఎన్నికల ఫలితాల మీద కూడా పడకుండా జాగ్రత్త తీసుకునే క్రమంలోనే గోరటి వెంకన్న పేరు చర్చలోకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నాగర్ కర్నూల్ నుంచి  సీనియర్ నేత మల్లు రవికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. 

మల్లు రవి,  గోరటి వెంకన్నలది ఒకే సామాజిక వర్గం. దీంతో గోరటి వెంకన్న సరైన అభ్యర్థి అని బిఆర్ఎస్ యోచిస్తుంది. కళాకారుడైన గోరటి వెంకన్నకు స్థానిక అంశాల మీద అవగాహనతో పాటు కవులు, కళాకారులతో, స్థానిక నాయకులతో ఉన్న పరిచయాలు.. ప్రజల్లో ఉన్న పేరు, అనుబంధం కూడా అనుకూలాంశాలుగా మారతాయని అధిష్టానం ఆలోచిస్తుంది. ప్రస్తుతం గోరటి వెంకన్న బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios