Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నిరుద్యోగులకు మరో తీపి కబురు

తెలంగాణ లో ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ సర్కార్ తాజాగా మరో రెండు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

Good News to Telangana Unemployed

తెలంగాణ లో ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ సర్కార్ తాజాగా మరో రెండు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఉదృతికి తెలంగాణ నిరుద్యోగిత కూడా ఓ మేజర్ కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అందువల్లే విద్యావంతులైన యువత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో బాగస్వామ్యమయ్యారు. అయితే తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరక్కపోవడంతో నిరుద్యోగ యువత ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్వయంగా సీఎం కేసీఆర్ ఇకనుంచి ఉద్యోగాల భర్తీ వేగాన్ని పెంచనున్నట్లు ప్రకటించారు. అన్నట్లుగానే అప్పటినుండి భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక గ్రూప్4, వీఆర్వో లతో పాటు వైద్యశాఖ లో ఉద్యోగాల కోసం వెనువెంటనే నోటిఫికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా మరో రెండు నోటిఫికేషన్లను తెలంగాణ ప్రభుత్వం టీఎస్ పిఎస్సి ద్వారా జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో 124 బిల్ కలెక్టర్ల పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే బేవరేజ్ కార్పోరేషన్ లో మరో 76 పోస్టుల భర్తీకి టీఎస్ పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ ఉద్యోగాల కోసం అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ పిఎస్సీ తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios