తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

First Published 6, Jun 2018, 5:13 PM IST
good news on telangana unemployees
Highlights

మార్కెటింగ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల వేగం పెంచింది. ఇటీవలే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా మార్కెటింగ్ శాఖలో పలు ఉద్యోగాల నియామకానికి సిద్దమయ్యింది.

మార్కెటింగ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 200 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆదేశాలు వెలువరించింది. ఇందులో 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్, 13 గ్రేడర్, 9 బిడ్ క్లర్క్, 60 జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇప్పటికే పోలీస్ శాఖలో వేలల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇక రెవెన్యూ శాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఒకటొకటిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుత నోటిఫికేషన్ వెలువడింది.  

 

loader