తెలంగాణ నిరుద్యోగులకు మళ్లీ శుభవార్త

తెలంగాణ నిరుద్యోగులకు మళ్లీ శుభవార్త

టిఎస్పిఎస్సీ మరో తీపి కబురును తెలంగాణ నిరుద్యోగులకు అందించింది. తాజాగా పాత పది జిల్లాల ప్రాతిపదికన టిఎస్పిఎస్సీ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో 31 జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేసి చేతులు కాల్చుకున్నది టిఎస్పిఎస్సీ. టిఎస్పిఎస్సీ చేసిన వ్యవహారంపై హైకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది. హైకోర్టు ఆదేశం మేరకు సోమవారం 10 జిల్లాల సరవణ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని టిఎస్పిఎస్సీ వెల్లడించింది. దరఖాస్తు గడువును కూడా పెంచింది. ఈనెల 15 వరకు గడువు ఉండగా దాన్ని ఈనెల 30 వరకు పెంచింది. ఈనెల 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇదిలా ఉండగా గతంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్ లో మార్పులు చేర్పులు చేసుకునే వెలుసుబాటు కూడా కల్పించింది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు తమ దరఖాస్తులో ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది టిఎస్పిఎస్సీ. అభ్యర్థులు ఏ పాత జిల్లాకు చెందిన వారో.. ఆ జిల్లా పేరును ఎడిట్ ఆప్షన్ ద్వారా పొందుపరిచే చాన్ష్ ఇచ్చింది.

టిఆర్టి సవరణ నోటిఫికేషన్ తాలూకు పూర్తి వివరాలు వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు టిఎస్ఫిఎస్సీ ప్రకటించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి నెలాఖరులో ఈ నోటిఫికేసన్ తాలూకు పరీక్షలు జరిగే అవకాశాలున్నట్లు టిఎస్ఫిఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page