తెలంగాణ నిరుద్యోగులకు బొచ్చెడు తీపివార్తలు

First Published 18, Dec 2017, 4:12 PM IST
good news galore for Telangana job aspirants
Highlights
  • మూడేళ్లు పూర్తి చేసుకున్న టిఎస్పిఎస్సీ
  • 98 ఉద్యోగ ప్రకటనలు వెలువరించిన కమిషన్
  • ఇప్పుడు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రకటనలు

తెలంగాణ నిరుద్యోగులకు ఎన్నో తీపి కబుర్లు అందించిన టిఎస్పిఎస్సీ మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది. ఈసారి మరిన్ని శుభవార్తలు చెప్పనుంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఆవిర్భవించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 6 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించింది.

ఈ విషయాన్ని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూడేండ్ల కాలంలో ఇప్పటి వరకు 98 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు.

నోటిఫికేషన్ల విడుదలతో పాటు సాయంత్రం టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను కూడా ప్రారంభించనున్నట్లు వివరించారు.

వెబ్ సంచికను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించనున్నట్లు వాణీ ప్రసాద్ తెలిపారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల ఆశలు ఈ నోటిఫికేషన్లతో తీరుతాయా లేదా అన్నది చూడాలి.

loader