నిరుద్యోగులకు శుభవార్త : భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

First Published 30, May 2018, 10:34 AM IST
good news for unemployers
Highlights

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్దమవుతుంది. పెద్దఎత్తున భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది. నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది టీఎస్‌పీఎస్సీ .

ఈ కొలువుల్లో ప్రధానంగా సాధారణ డిగ్రీ అర్హత కలిగినవే అధికంగా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.మరోవైపు పెండింగ్ పోస్టుల భర్తీని పూర్తిచేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే నోటిఫికేషన్ల విడుదలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది.

ఇందులో . వీఆర్వో -700 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 450, గ్రూప్-1లో 125 ఖాళీలు ఉండనున్నట్టు సమాచారం. ఆర్టీసీలో 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది.జూన్ 2న ప్రకటన విడుదల చేసి ప్రిలిమినరీ-మెయిన్స్, మౌఖిక పరీక్షలను వచ్చే మార్చినాటికి పూర్తిచేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది.

 

loader