తెలంగాణ లో నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. వరంగల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మే నెల 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ తదితర విభాగాల నియామకాలకు ఎంపిక జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.  2018 అక్టోబర్ నాటికి 17 ఏళ్లు నిండి.. 23 ఏళ్లలోపు వారు ఎవరైనా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. 
మొదట దేహదారుడ్య పరీక్షలు తర్వాత రాత పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగ్గిన వారికి ఉద్యోగం లభిస్తుంది. తెలంగాణ జిల్లాలలోని అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.