మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

మేడారం జాతర (medaram jathara)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ (railway department) శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల (special trains)ను ఏర్పాటు చేసింది. సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ నుంచి వరంగల్ కు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Good news for the devotees going to medaram jatara. South Central Railway to run special trains to Warangal..ISR

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు భక్తుల సౌకర్యం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భక్తులు మేడారం వెళ్లేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతగానో దోహదపడతాయని మంత్రి తెలిపారు.

బలపరీక్ష, బడ్జెట్ సమావేశాలున్నాయ్.. అందుకే కోర్టుకు రాలేకపోతున్నా - అరవింద్ కేజ్రీవాల్

సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రధాన కేంద్రాల ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఇందులో 07017/07018: సిర్పూర్ కాగజ్ నగర్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్ నగర్,  07014/07015: వరంగల్ - సికింద్రాబాద్ - వరంగల్, 07019/0720 నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్ మధ్య కొనసాగుతాయని చెప్పారు.

వెల్లుల్లి కిలో రూ.500.. పంట పొలాల్లో సీసీ కెమెరాలతో రైతుల పహారా..

గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, గిరిజన వర్గాల సంక్షేమానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు మేడారం జాతర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు ఇస్తోందని అన్నారు. 

యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. భారీగా నగదు, ఆభరణాల దొంగతనం..

ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆర్టీసీ కూడా సమక్క సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర కోసం 6 వేల అదనపు బస్సులను నడపాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే బస్సుల పార్కింగ్ కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ జాతర కోసం సుమారు 14 వేల మంది ఆర్టీసీ కార్మికులు పని చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios