Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రేషన్ డీలర్లకు శుభవార్త (వీడియో)

రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కారు శుభవార్త అందించింది. డీలర్లకు ప్రస్తుతం కీలో బియ్యంపై ఇస్తున్న 20 పైసల కమీషన్ ను 70 పైసలకు పెంచుతున్నట్లు సర్కార్ నిర్ణయించింది. ఇవాళ డీలర్ల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.  
 
Good News For Telangana Ration Dealers,
Author
Hyderabad, First Published Aug 23, 2018, 3:26 PM IST

రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కారు శుభవార్త అందించింది. డీలర్లకు ప్రస్తుతం కీలో బియ్యంపై ఇస్తున్న 20 పైసల కమీషన్ ను 70 పైసలకు పెంచుతున్నట్లు సర్కార్ నిర్ణయించింది. ఇవాళ డీలర్ల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.  

ఈ సమావేశం అనంతరం ఆర్థిక, పౌర సరఫరా శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... డీలర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉందని అన్నారు. కిలో బియ్యంపై డీలర్లకు ఇప్పుడిస్తున్న కమీషన్ పెంచడంతో పాటు పాత బకాయిల మొత్తాన్ని చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ కమీషన్ పెంపు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తుందని అన్నారు. 

తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత నెలలో తెలంగాణ రేషన్ డీలర్ల అసోసియేషన్ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం వారిని  సముదాయించి సమ్మె జరగకుండా చేసింది. వీరు సమస్యలపై చర్చించేందుకు ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు. ఈ ఉపసంఘం ఇవాళ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

ఇప్పటికే పౌరసరపరా శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేశామని మంత్రి ఈటల పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ రేషన్ బియ్యం పంపిణీలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని ఈటల స్పష్టం చేశారు.  అటు ప్రజలకు, ఇటు డీలర్లకు న్యాయం జరిగేలా మంత్రి వర్గ ఉపసంఘం రిపోర్టును రూపొందించినట్లు ఆయన తెలిపారు.  

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios