Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బిజెపికి గుడ్ న్యూస్

  • సంచలన సర్వే వెల్లడించిన రిపబ్లిక్ టివి
  • తెలంగాణలో బిజెపికి 3 ఎంపి స్థానాలు ఖాయం
  • టిఆర్ఎస్ కు 10కి పైగా వస్తాయన్న సర్వే
  • 2 స్థానాలకే పరిమితం కానున్న కాంగ్రెస్
good news for telangana bjp


తెలంగాణలో బలపడాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీకి ఇది ఒక గుడ్ న్యూస్. ఇంతకాలం ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆందోళన ఉన్న తరుణంలో సరికొత్త వార్త బిజెపి శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. మరోవైపు తెలంగాణ అధికార టిఆర్ఎస్ పార్టీకి సైతం తియ్యటి ముచ్చట అందింది. ఇంతకూ రెండు పార్టీలకు ఆ తీపి వార్త ఏంటబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.

తెలంగాణలో బిజెపికి 3 ఎంపి స్థానాలు ఖాయంగా వస్తాయని అగ్రగామి జాతీయ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ టివి ప్రకటించింది. ఆ సంస్థ చేసిన సర్వేలో తెలంగాణలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 3 స్థానాలు వస్తాయని, అలాగే కాంగ్రెస్ కూటమికి 2 ఎంపి స్థానాలు వస్తాయని ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మిగతా 12 స్థానాలు ఇతరులకు వస్తాయని ప్రకటించింది. మిగతా 12 స్థానాల్లో ఒక స్థానం ఎంఐఎం గెలుచుకునే  చాన్స్ ఉండనే ఉంటుంది. అయితే మిగతా 11 స్థానాల్లో టిఆర్ఎస్ గెలిచే చాన్స్ ఉన్నట్లు రిపబ్లిక్ ఇచ్చిన సర్వే పలితాలు వెల్లడిస్తున్నాయి.

good news for telangana bjp

రిపబ్లిక్ సర్వే ఫలితాలు తెలంగాణలో సంచలనం సృష్టించాయి. ఆ సంస్థ ఇచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణలో మరోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 11 ఎంపి స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉండడాన్ని చూస్తే.. సుమారు 70 సీట్ల వరకు టిఆర్ఎస్ గెలుచుకునే చాన్స్ ఉందా అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. మరో విషయం ఏమనగా తెలంగాణ జెఎసి పార్టీగా ఆవిర్భవించలేదు కాబట్టి..ఫలితాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. జెఎసి పార్టీ వచ్చిన తర్వాత తారుమారైతాయా? లేక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్తగా రాబోతున్న జెఎసి పార్టీని పరిగణలోకి తీసుకుంటే ఫలితాల్లో మార్పులు చేర్పులు ఉండే చాన్స్ ఉండొచ్చు.

ఏది ఏమైనా రిపబ్లిక్ సర్వే ప్రకారం తెలంగాణలో ఒక స్థానానికి పరిమితమైన బిజెపి మూడు ఎంపి స్థానాలకు ఎగబాకే చాన్స్ ఉండడం ఆ పార్టీకి కొంత బూస్ట్ ఇచ్చినట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ స్థానంలో బిజెపి గెలిచిన తరుణంలో మిగతా రెండు స్థానాలు ఏమిటబ్బా అన్న చర్చ సాగుతోంది. అయితే మల్కాజ్ గిరితోపాటు నిజామాబాద్ సీటును సైతం గెలుసుకునే చాన్స్ ఉందా అన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్ ఎంపిగా ప్రస్తుతం కేసిఆర్ కుమార్తె కవిత ఉన్నారు. అయితే అక్కడ ఇప్పుడు బిజెపి నేతగా టిఆర్ఎస్ ఎంపి డి.శ్రీనివాస్ కొడుకు ధర్మపురి అర్వింద్ సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. మరి కవిత అసెంబ్లీకి పోటీ చేస్తే అక్కడ బిజెపికి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios